దోహా, నవంబర్ 25 (పున్నమి ప్రతినిధి):
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చరిత్ర సృష్టించాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ తరఫున ఆడిన వైభవ్ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. 384.90 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఈ ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్‌లో 28 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ, 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కేవలం ఐదు ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులకు చేరడం మరో విశేషం. వైభవ్ విధ్వంసక బ్యాటింగ్‌తో ఇండియా-ఏ జట్టు యూఏఈపై ఘన విజయం సాధించింది.
