దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం

0
4

కొత్తపేట,జూన్ 30,పున్నమి న్యూస్ : దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేదోడు అందిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం  ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అలింకో ద్వారా ఏర్పాటుచేసిన కృత్రిమ ఉపకణాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు సుమారు రూ 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆలింకో భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కృత్రిమ అవయవాలు ఉపకరణాలు వాటి భాగాల లభ్యత, వినియోగం, సరఫరా పంపిణీని ప్రోత్సహిస్తుం దన్నారు. ఆర్థోపెడిక్‌, దృష్టి, వినికిడి లోపం, మేధో వైకల్యం గల వికలాంగుల ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాలు వ్యక్తిగత రక్షణ కిట్లు ఉచితంగా అందిస్తుందన్నారు.వికలాంగుల రక్షణతో పాటు ఆసుపత్రులు, ఇతర సంక్షేమ సంస్థలకు చేయూతనందిస్తుందన్నారు పిల్లలు, మహిళలు, వృద్ధులు వికలాంగులకు తగిన శిక్షణ ఇస్తుందని, గత ఏడాది నవంబర్‌ లో ఆలింకో సంస్థ వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి దివ్యాంగుల్లో లోపాలను శాస్త్రీయపరంగా గుర్తించి అర్హులైన వారికి కృత్రిమ అవయవాలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. కృత్రిమ అవయవాల పంపిణీకై జిల్లాకు రూ.4 కోట్లు సంస్థ కేటాయించిందని తెలిపారు. ఇందులో కొత్తపేట నియోజకవర్గానికి రూ.68 లక్షలు (రూ.68,21,953) వెచ్చించినట్లు వివరించారు. బ్యాటరీ ఆపరేటర్‌ మోటార్‌ సైకిల్లు 101, ట్రై సైకిళ్లు 59, వీల్‌ చైర్లు 69, నడక కర్రలు 65 తో సహా మొత్తం 630 పరికరాలు ఈ కార్యక్రమంలో 417 దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీవో శ్రీకర్,అనపర్తి నియోజకవర్గ తెదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ,అయినవిల్లి సత్తిబాబు గౌడ్ నాలుగు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here