దళితులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: దళిత ప్రజాసంఘాలు

0
127

దర్శి, జూన్ 8, 2020 (పున్నమి విలేఖరి): దర్శి పట్టణంలో సోమవారం స్థానిక ఏపీటీఎఫ్ ఆఫీసు లో రాష్ట్రదళితసేన దరిశి నియోజకవర్గ కమిటీ అద్వర్యం కె.మార్కు అద్యక్షతన “దళితులపై దాడులు – ప్రభుత్వంవైఖరి” అనే ఆంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర దళితసేన దరిశి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితులు, దళిత అధికారులు పై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుపై దాడులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించాలని దళిత అధికారుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని, దళిత అధికారుల పై దౌర్జన్యం, దాడి చేసిన ముద్దాయిను ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటియాక్టు కింద అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిసి సంఘాల రాష్ట్ర నాయకులు అన్నవరపు వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈపాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఇంకా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్ని మాట్లాడారు. ఈకార్యక్రమంలో కె.మార్కు, ఆగ్రో టైం స్కెల్ వర్క్స్ &ఎంఫ్లాయిస్ యూనిట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఎరుకులసంక్షేమ సంఘంనాయకులు వెంకటేశ్వరరావు, ఎస్సీ నాయకులు జీ. పెద్ద వెంకటస్వామి, ఏపీటీఎఫ్ దరిశి మండల ప్రధాన కార్యదర్శి యన్.జాన్, పాస్టర్ సంఘం నాయకులు ఇత్తడి ఏసుపాదం‌‌, రాచపూడి ఆహరోన్ తదితరులు పాల్గొన్నారు.