బలహీన వర్గాలకు విద్యను చేరువ చేసిన గొప్ప వ్యక్తి జార్జి

0
127
జార్జ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి సురేష్

బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో స్వర్గీయ శామ్యూల్ జార్జి విద్యాసంస్థలు స్థాపించటం జరిగిందని, ఆ క్రమంలో బడుగు, బలహీన వర్గాలకు తమ విద్యాసంస్థల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్వర్గీయ సామ్యూల్ జార్జి 88 వ జయంతి ని పురస్కరించుకొని మార్కాపురం లోని శామ్యూల్ జార్జి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జార్జి సమాధి వద్ద నివాళులు అర్పించిన మంత్రి సురేష్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జార్జి ఆశయ సాధనకు కృషి చేసి జార్జి విద్యాసంస్థల ద్వారా పేదలకు ఉన్నత విద్యను చేరువ చేస్తామన్నారు. తనకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని, మంత్రిగా తాను కూడా జగనన్న ఆశయ సాధనలో శక్తివంచన లేకుండా పని చేస్తున్నానన్నారు. తమ కుటుంబం పై ఈ ప్రాంత ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతఙ్ఞతలు తెలిపారు. పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం కళాశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. జార్జి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ కె వి ఎస్ నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాజబాబు, డీన్ మస్తానయ్య, పాస్టర్ ఆండ్రుస్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, యర్రగొండపాలెం నియోజకవర్గం లోని పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.