కోటగిరి వెంకటేశ్వరరావు గారిని పరామర్శించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 09/10/2026.
మైలవరం మండలం తోలుకోడు గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు గారి తండ్రి కోటగిరి సత్యనారాయణ గారు ఇటీవల మృతి చెందడంతో, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు శుక్రవారం మైలవరం పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వెంకటేశ్వరరావు గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గారి మృతి పట్ల ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

