संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ASIFABAD

తిర్యాణి మండలంలో CA ల్యాండ్స్ వివరాలు ఇవ్వాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తిర్యాణి మండలంలో CA ల్యాండ్స్ వివరాలు ఇవ్వాలి

खबर की मुख्य बातें

  • తిర్యాణి, ఆగస్టు 22: మండల పరిధిలోని CA (Compensatory Afforestation) ల్యాండ్స్ వివరాలను వెల్లడించాలని కోరుతూ తిర్యాణి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ (MRO)కు వినతిపత్రం అందజేశారు.
  • జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయంలో MROను కలిసి తమ డిమాండ్లను వివరించారు.
  • మండలంలో మొత్తం ఎంత భూమిని CA ల్యాండ్స్‌గా గుర్తించారు, ఏయే సర్వే నంబర్లలో ఆ భూములు ఉన్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి అనే పూర్తి వివరాలను అందించాలని కోరారు.

తిర్యాణి, ఆగస్టు 22: మండల పరిధిలోని CA (Compensatory Afforestation) ల్యాండ్స్ వివరాలను వెల్లడించాలని కోరుతూ తిర్యాణి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ (MRO)కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయంలో MROను కలిసి తమ డిమాండ్లను వివరించారు.
మండలంలో మొత్తం ఎంత భూమిని CA ల్యాండ్స్‌గా గుర్తించారు, ఏయే సర్వే నంబర్లలో ఆ భూములు ఉన్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి అనే పూర్తి వివరాలను అందించాలని కోరారు. అటవీ భూములకు బదులుగా తీసుకున్న CA భూముల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో భూములు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.
CA భూములకు సంబంధించిన అధికారిక వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలకు అవగాహన కలగడంతో పాటు, భూముల పరిరక్షణపై పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
దీనిపై MRO సానుకూలంగా స్పందిస్తూ, CA ల్యాండ్స్‌కు సంబంధించిన వివరాలను సేకరించి అందజేస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *