తాటిపర్తిపాలెంలో ‘పొలంబడి’

0
198

తాటిపర్తిపాలెంలో ‘పొలంబడి’
వెంకటాచలం, ఫిబ్రవరి 27 (పున్నమి విలేకరి):
మండలంలోని ఇసకపాలెం ఆర్బికే పరిధిలోగల తాటిపర్తిపాలెంలో శనివారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జి వెంకటేశ్వర్ రావు (డిడిఎ), సురేష్ (ఏవో), నెల్లూరు సంయుక్త వ్యవసాయ సహాయకులు కార్యాలయం నుంచి నర్సోజి(ఎడిఎ) హాజరయ్యారు. పొలంబడి విధివిధానాలు, వాటి అమలు గురించి రైతులతో చర్చించారు. వారికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడరాదన్నారు. ఎక్కువ రసాయన క్రిమిసంహారకాలు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, వ్యవసాయ సహాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

0
0