డెంగ్యూ జ్వరం జీవితకాలంలొ నాలుగు సార్లకు మించి రాదు.ఐదవ సారి రాదు అంటే అది మనిషి గొప్పదనం కాదు.అలాగని డెంగ్యూ వైరస్ చేతగానితనము అంతకన్నా కాదు.మనకి డెంగ్యూ జ్వరాన్ని కలిగించే వైరస్ లు నాలుగు రకాలు .ఒక రకం వల్ల డెంగ్యూ జ్వరం వస్తే ఆ రకం వైరస్ మనకు మళ్ళీ సంక్రమించే అవకాశం లేదు. ఆ రకం వైరస్ కు వ్యతిరేకంగా మన శరీరం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇలా ఏర్పడిన వ్యాధి నిరోధక శక్తి మనిషీ జీవితకాలం పాటు కొనసాగుతుంది .అందుకే జీవితంలో ఈ రకమైన డెంగ్యూ జ్వరం మళ్ళీ వచ్చే అవకాశం లేదు.ఈ నాలుగు రకాల డెంగ్యూ వైరస్ లు నాలుగు సార్లు మాత్రమే డెంగ్యూ జ్వరాన్ని కలిగించ గలవు.ఐదవ సారి వచ్చే అవకాశం లేనే లేదు.
ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటిటంటే మొదటి సారి కంటే రెండో సారి ప్రమాదం ఎక్కువ. రెండవసారి కంటే మూడవసారి, మూడవ సారి కంటే నాలుగవసారి ప్రమాదం ఎక్కువ.
డాక్టర్ MV RAMANAIAH