ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థుల ఎంపికతో ఆనందం.
మర్రిపాడు మండలంలోని నందవరం ఆదర్శ పాఠశాల నుండి ఐదుగురు, కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల నుండి ఒకరు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. మహిత నూజివీడు క్యాంపస్‌కు, లహరి, రమ్య, వెంకటమనోహర్, యశ్వంత్ ఇడుపులపాయకు, శృతి ఒంగోలు క్యాంపస్‌కు ఎంపిక కాగా, విద్యాశాఖ అధికారులు జ్యోతి, ధనలక్ష్మి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.