జీవీఎంసీ కమిషనర్‌కు సమస్యలపై వినతి సమర్పించిన కార్పొరేటర్ లక్ష్మిబాయి.
జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్‌ను గాజువాక 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మిబాయి వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక పనులు, మైదాన అభివృద్ధికి నిధుల కేటాయింపు, ఇతర సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పులి వెంకటరమణారెడ్డి, దొమ్మేటి రాము నాయుడు, అప్పల రాజు పాల్గొన్నారు.