संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

గాజువాక, నవంబర్ 9 (పున్నమి ప్రతినిధి): జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాజువాక కోర్టు సముదాయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. XIII అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ఎస్.ఎం. ఫణి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి VIII అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ఎస్. కవిత, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) డి. గీతారాణి, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), IX అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సంగవరపు సూర్య కిరణ్ శ్రీ హాజరయ్యారు. అలాగే విశాఖపట్నం సిటీ సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ వాసు నాయుడు, దువ్వాడ సీఐ నమ్మి గణేష్, గాజువాక ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.

అనంతరం కోర్టు సముదాయం నుంచి 100 ఫీట్ రోడ్ సిగ్నల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్కడ న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి పౌరుడికి న్యాయం పొందే హక్కు ఉందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని ప్రజలకు వివరించారు. అర్హులైన పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించే విధానాలపై అవగాహన కల్పించారు.

ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందుబాటులో ఉండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చాటిచెప్పారు.

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గాజువాక కోర్టులో వేడుకలు – అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు న్యాయ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *