జపాన్‌ ‌జీవనశైలికి జై కొట్టాల్సిందే!

0
179

జపాన్‌ ‌జీవనశైలికి జై కొట్టాల్సిందే!
ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్స రాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్‌ ‌పౌరుడు. ఆయన తన తొంభై సంవత్సరాల వయసు వరకు పని చేస్తూనే ఉన్నాడు. ఆయనే కాదు, జపాన్‌ ‌పౌరులు ఎక్కువ కాలం జీవించడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక ఇక్కడి మహి ళలయితే గత పాతిక సంవత్స రాలుగా ఇతర దేశాల మహిళల కంటే అదనపు సగటు జీవిత కాలంతో జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేస్తు న్నారు. 2010లో వీరి సగటు జీవిత కాలం 86.3 సంవత్సరా లుగా ఉంది. 2011లో ఒక్కసారి మాత్రమే 85.9కి తగ్గి హాంకాంగ్‌ ‌కి మొదటి స్థానం ఇచ్చి రెండో స్థానానికి వెళ్లారు ఈ మహిళలు. ఇందుకు కారణం 2011 మార్చిలో వచ్చిన ‌తుఫాన్‌ ఇక ఇక్కడి మగవారి సగటు జీవిత కాలం 79.4 సంవత్సరాలు. ఇది మహి ళల కంటే తక్కువే అయినా ఇతర దేశాల మగవారితో పోలిస్తే ఇది ఎక్కువే. ప్రస్తుతం జపాన్‌ ‌జీవన కాలం విషయంలో 84.46 సగ టుతో ప్రపంచంలో మూడో స్థా నంలో ఉంది. దాని ముందు మొనాకో, మకావ్‌ ఉన్నాయి. ఈ విషయంలో 67.80 సగటు జీవిత కాలంతో ప్రపంచదేశాల్లో 163వ స్థానంలో ఉన్న మనం, జపాన్‌ ‌పని రాక్షసులు అంత ఎక్కువకాలం ఎలా జీవిస్తున్నారో తెలుసుకుని తీరా ల్సిందే….
వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరి అన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. వైద్య సదు పాయం తేలిగ్గా అందుబాటులో ఉం టుంది. ఇవన్నీ కాకుండా వృద్ధుల పట్ల ఇక్కడ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిసి వారి జీవితకాలాన్ని పెంచు తున్నాయి.
ముఖ్యంగా తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. సోయాబీన్స్‌తో తయారయిన తోఫు అనే కొలెస్ట్రాల్‌ ‌లేని పెరుగుని వాడతారు. ఇందులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
వేల సంవత్సరాలుగా చైనావారు ఔషధాల్లో వాడుతున్న షీటేక్‌ ‌పుట్ట గొడుగులను జపాన్‌ ‌వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ ఉంటుంది.
ఉప్పు ఎక్కువ వాడాల్సిన వంట కాలు, చేపల వేపుడు, నిలవ పచ్చళ్లు, సోయాసాస్‌ ‌లాంటివాటిని బాగానే తీసు కుంటారు. అక్కడి మగవారు స్మోకింగ్‌ ‌కూడా ఎక్కువే చేస్తారు. ప్రతి ముగ్గురిలో ఒకరు పొగతాగుతారు. ఆల్కహాల్‌ ‌సంబం ధింత పానీయాలు సైతం ఎక్కువే తీసు కుంటారు. అయితే వారిలో ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు. 80శాతం పొట్టనిండగానే తినడం ఆపేయమనే ఒక జపనీస్‌ ఆరోగ్య సూక్తిని వారు బాగా పాటిస్తారు.
రెండేళ్ల క్రితం టోక్యో ప్రొఫెసర్‌ ఒకరు జపాన్‌ ‌ప్రజల జీవితకాలం ‌పై అధ్యయనం చేశారు. ఆయన వెల్లడించిన విషయాల్లో ముఖ్యమైనది జపాన్‌ ‌ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల పై మంచి ప్రభావాన్ని చూపు తోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరి రక్షణ, కాలుష్యనివారణ వీటన్నింటిపై
శుభ్రత పట్ల వారికున్న శ్రద్ధ ప్రభావం చూపుతోందని ఆయన అధ్యయనంలో తేలింది. అక్కడ షింటో అనే సంప్ర దాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా ఉండాలని జపాన్‌వారు నమ్ముతారు.
వీరిలో ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిరంతరం జరుగుతుంటాయి. పాఠశాల ల్లోనూ, పనిప్రదేశాల్లోనూ ఇలాంటి సదు పాయాలు ఉంటాయి.ఇవి కాకుండా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు సైతం ఈ సౌకర్యాలు కల్పిస్తాయి. ఇక్కడి ప్రభుత్వాలు ఆర్థిక పెరుగుదలతో పాటు ప్రజల ఆహార ప్రమాణాన్ని పెంచడంలో చర్యలు తీసుకుంటాయి.
ఇవన్నీ కాకుండా జపాన్‌కి తైవాన్‌కి మధ్య ఉన్న ద్వీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మరింతఎక్కువ కాలం జీవిస్తున్న ట్టుగా పరిశోధకులు తేల్చారు. వీరిలో గుండె జబ్బులు, క్యాన్సర్‌లు తక్కువ
ఉన్నాయి. వీరిలో తరతరాలుగా వస్తున్న జన్యు లక్షణాలు పలురకాల వ్యాధులను రాకుండా నివారిస్తున్నట్టుగా పరిశోధ కులు కనుగొన్నారు.
మొత్తానికి చురుకైన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే జపాన్‌ ‌ప్రజల ఆరోగ్యరహస్యాలుగా తెలుస్తోంది.

0
0