ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువలే జరిగిన జడ్పిటిసి & ఎంపీటీసీ ఎన్నికల అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొని కందుకూరు నియోజకవర్గంలో మంచి ఫలితాలు సాధించావని బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని అభినందించడం జరిగింది. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఇటువలే గెలిచిన జడ్పిటిసి &ఎంపీటీసీ అభ్యర్థులను అభినందించారు. జరగబోయే ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటున్నట్టు తెలిపారు.




