చద్దిమూట:ఆరుపల్లి గోవిందరాజుల

0
301

చద్దిమూట

ఆరుపల్లి గోవిందరాజులు

రాఘవయ్య ఆధ్యాత్మిక చింతనగల వ్యక్తి.

అజయ్, అరవింద్, అవినాష్ ముగ్గురు కొడుకులు చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడంలో తల దూర్చారు. ఎక్కడా ఎవరికీ ఏ చిన్న ఉద్యోగం లభించలేదు. వారు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

తండ్రి ఎప్పుడూ అవసరార్థం ఏ పని పురమాయించినా విసుక్కునేవారు. మొదటి వాడికి చెబితే రెండో వాడికి చెప్పు, రెండో వాడికి చెబితే మూడో వాడికి చెప్పమనే వారు..

భార్య ,కొడుకులను సమర్థించుకుంటూ వచ్చేది. ఆ కారణంగా తను కొడుకుల దృష్టిలో చులకన అయ్యాడు.

ఒక పర్యాయం రాఘవయ్య చిన్ననాటి స్నేహితుడు రామకోటి స్నేహితుడిని చూడడానికి వెళ్ళాడు.

మాటలు పూర్తి అయ్యాక రామబ్రహ్మం హడావిడిగా ఇంటికి బయలుదేరాడు.

స్నేహితుడు వెళ్ళిన కొంతసేపటికి రామకోటి తన గొడుగు విడిచిపెట్టినది గమనించి పెద్ద కొడుకుతో ఆ గొడుగును ఇచ్చి రమ్మన్నాడు. అది విని భార్య “వచ్చేది వర్షాకాలం తిరిగి ఎందుకు ఇవ్వడం? మనకు పనికి వస్తుంది కదా!” అంది.

రాఘవయ్య ,”ఆ వస్తువు మనది కాదు. పైగా అతడు పేదవాడు తిరిగి కొనలేడు. పరుల సొమ్ము పాము వంటిది”అంటూ నీతి చెప్పాడు.అజయ్ తండ్రితో “నాకు ఈదినం ఊపిరి తీసుకోలేనన్ని పనులు ఉన్నాయి తమ్ముడిని వెళ్ళమనండి” అని తప్పించుకున్నా డు.తండ్రి మాటవినిన అరవింద్ “రేపు నేను ఉద్యోగం కోసం ఒక రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. చదువుకుంటున్నాను. తమ్ముడికి చెప్పండి” అన్నాడు.

పెద్దల మాట చద్దిమూటగా భావించే అవినాష్ తండ్రి మాట కాదనలేక రామకోటి ఇల్లు చేరి గొడుగు అందించాడు.రామకోటి అవినాష్ ని ఎంతో ప్రశంసించి తను ఏం చేస్తున్నది వివరాలు అడిగాడు. “అవినాష్ తను చదివిన చదువు, కంప్యూటర్ కోర్సు అని చెప్పి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను” అన్నాడు.

రామకోటి వెంటనే ఓ ఆఫీసుకు తీసుకువెళ్లి స్నేహితుడైన ఆఫీసరుకు అవినాష్ వివరాలు చెప్పి ఉద్యోగం కోరాడు.

ఆఫీసరు వెంటనే రామకోటి మాటలు కాదనలేక ప్రశ్నలు కురిపించి ఎన్నిక చేసాడు.

ఆ మాటలు విన్న రాఘవయ్య చూసావా బాబూ ధర్మాన్ని నువ్వు రక్షించావు గనుక ఏ ప్రయత్నం చేయకుండానే ఉద్యోగం లభించింది” అన్నాడు. అవినాష్ మనసులో నిజమే పెద్దల మాట చద్దిమూట అందుకే అన్నారు అని అనుకున్నాడు.

 

 

 

ఆరుపల్లి గోవిందరాజులు

రాఘవయ్య ఆధ్యాత్మిక చింతనగల వ్యక్తి.

8801513061