గోడ కట్టారు గేటు మరిచారు

0
230

గోడ కట్టారు గేటు మరిచారు

అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైన పాఠశాల ఆవరణం

పట్టించుకోని అధికారులు

గూడూరు పున్నమి ప్రతినిధి. గూడూరు పట్టణంలోని 7 వార్డు మునిసిపల్ ప్రాధమిక పాఠశాలకు సంబంధించి కొన్ని దశాబ్దాల  తర్వాత ఇటీవల గోడను కట్టడం జరిగింది. తర్వాత .ఏమైందో తెలియదు కాని గోడకు సంబంధించి సిమెంటు పూతను వేయలేదు సరికదా గేటును కూడా  పెట్టకుండా వదిలివేశారు. దీంతో అక్కడ రోజూ మందుబాబులు రాత్రుళ్ళు జల్సా చేయడం కొంతమంది దీన్ని బహిర్భూమిగా వాడుకోవటం పరిపాటి అయింది. చీకటి  కార్యకలాపాలకు నిలయంగా మారడంతో పాఠశాల ఆవరణాన్ని ప్రతిరోజూ విద్యార్థులు, టీచర్లు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మునిసిపల్ ఆఫీసుకు కూతవేటు దూరంలో, శివాలయంకు పక్కనే ఉన్న ఈ పాఠశాల వెంబడి కొన్ని వందలమంది రాకపోకలు చేస్తుంటారు.ఎవరూ పట్టించుకొనే పాపాన పోరు. ఇక అధికారులు సైతం ఈ దారినే వెళుతూ కూడా పట్టించుకోకపోవడం దారుణమని  స్థానికులు వాపోయారు. ఇకనైనా మునిసిపాలిటీ కమీషనర్ గారు కలుగ చేసుకొని సదరు పాఠశాలకు గేటును మంజూరు చేయవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

0
0