संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

గిరిజనులకు అండగా ఉంటాం — జనసేనాని బొబ్బేపల్లి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
గిరిజనులకు అండగా ఉంటాం — జనసేనాని బొబ్బేపల్లి

खबर की मुख्य बातें

  • మనుబోలు (పున్నమి అక్టోబర్ 23): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త జనసేనాని బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలం గొట్లపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీని పర్యటించారు.
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన కాలనీ నివాసులను కలుసుకుని వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.
  • వాళ్లలో ఇంకా కొంతమందికి ఉచిత గ్యాస్ సౌకర్యం అందలేదని స్థానికులు వివరించగా, ఆ అంశాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం పథకాల ద్వారా పరిష్కారం కల్పిస్తామని బొబ్బేపల్లి తెలిపారు.

మనుబోలు (పున్నమి అక్టోబర్ 23):
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త జనసేనాని బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలం గొట్లపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీని పర్యటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన కాలనీ నివాసులను కలుసుకుని వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.

వాళ్లలో ఇంకా కొంతమందికి ఉచిత గ్యాస్ సౌకర్యం అందలేదని స్థానికులు వివరించగా, ఆ అంశాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం పథకాల ద్వారా పరిష్కారం కల్పిస్తామని బొబ్బేపల్లి తెలిపారు.

గత వైసీపీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించారని, అయితే ఆ వ్యవస్థ ప్రజలకు ఎంత ఉపయోగపడిందో ఇప్పటికీ ప్రశ్నార్థకమేనని ఆయన వ్యాఖ్యానించారు.

“ఇప్పటికీ వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, రైతులు నిలదొక్కుకోవాలన్నా, యువత భవిష్యత్తు మెరుగుపడాలన్నా — ఒక బలమైన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం” అని జనసేనాని బొబ్బేపల్లి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల నరసింహ, పారిచెర్ల శరత్, సందూరి శ్రీహరి, పోట్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *