खबर की मुख्य बातें
- గాలి రామ్మోహన్ నాయుడు కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు: మండలంలోని గుండెమడగల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి రామ్మోహన్ నాయుడు కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
- వింజమూరులోని ఎస్వీ కళ్యాణ మండపంలో గాలి రామ్మోహన్ నాయుడు సోదరుడు గాలి రాజశేఖర్, ఆదిశేషమ్మ దంపతుల కుమారుడు నరేంద్ర కుమార్, గౌతమి వివాహం బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.
- ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
గాలి రామ్మోహన్ నాయుడు కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు: మండలంలోని గుండెమడగల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి రామ్మోహన్ నాయుడు కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. వింజమూరులోని ఎస్వీ కళ్యాణ మండపంలో గాలి రామ్మోహన్ నాయుడు సోదరుడు గాలి రాజశేఖర్, ఆదిశేషమ్మ దంపతుల కుమారుడు నరేంద్ర కుమార్, గౌతమి వివాహం బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు