తేనే పాటల జాబిల్లి-దేవులపల్లి అని పేరు పొందిన శాస్త్రిగారు 1.11.1897న తూ।।గో।। జిల్లా పిఠాపురం దగ్గరలోని చంద్రాయ పాలెంలో సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లకు జన్మిం చారు. పదేళ్ళ వయసులో పద్యరచన పదహరవఏట అష్టావధానం చేసారు. డిగ్రీ ముగించి ‘‘ట్యూటర్’’
ఉద్యోగం చేస్తూ విద్యార్థుల కోసం జయజయ ప్రియభారతి పాటరాసారు.
ప్రవాసము ఊర్వశి కన్నీరు శ్రావణి కార్తీక మహాతి విప్రనారాయణ వంటి పలు సాహితీ ముత్యాలను తెలుగువారికి అందించారు.
బెజవాడ గోపాలరెడ్డిగారు కృష్ణశాస్త్రి గారికి మంచిమిత్రులు వారి ద్వారా బి.యన్.రెడ్డిగారి పరిచయంతో తొలిఎసారి ‘మల్లేశ్వరి’(1951) చిత్రానికి మంచిపేరు వచ్చింది(1952)లో అనా ర్కలీ చిత్రానికి పాటలు రాసారు. కాని ఈ చిత్రం నిర్మితం కాలేదు.
కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షాన్ని’ 1921 ప్రారంభించి 1925 పూర్తిచేసారు. 1922లో తన పాతికేళ్ళ వయస్సులో భార్యావియోగం జరిగింది. 1953లో నాయిల్లు. రాజీనాప్రాణం. రాజగురువు(1954) బంగారుపాప భాగ్యరేఖ(1959)వంటి చిత్రాలకు పని చేసారు. అదే సంవత్సరం హైదరాబాద్ ఆకాశవాణిలో ‘ప్రయోక్త’గా చేరి ఎన్నో యక్ష గానాలు పలు లలితగీతాలు రాసారు. 1958 లో తన కుమార్తెను కోల్పోయారు. కృష్ణ శాస్త్రిగారు మల్లెల సౌరభాన్ని వెన్నెల చల్లదనాన్ని భావకవిత ఆనందాన్ని అన్నింటిని కలిపిన తెలుగు తీయదనాన్ని మనకు అందిం చారు. తన 67వఏట గొంతు క్యాన్సర్‌తో స్వరపేటిక తొలిగించారు. ‘భక్త శబరి’ (1960), ‘రాజమకుటుం’ (సడిసేయకే గాలి), ‘సుఖదు:ఖాలు’ ఇది మల్లెలవేళయని (1967), ‘అమాయకుడు’, మనిషైతే మన సుంటే(1968) ‘డా।।ఆనంద్’ (1966) ‘‘పూజాఫలం’’(1964), సంగీతలక్ష్మి(66), ‘ఉండమ్మ బొట్టుపెడతా’(68), ‘కలసిన మన సులు’(68),
‘ఏకవీర’, ‘జగత్‌కిలాడీలు’, ‘బంగారుపంజరం’(69), ‘మాయని మమత’ (70), కల్యాణమండపం’- ‘మట్టిలో మాణి క్యం’(71), సంపూర్ణ రామాయణం(72), ‘బలిపీఠం’(75), ‘మంచిరోజులొచ్చాయి’ (72), ‘భక్తతుకారాం(73), ‘చీకటి వెలుగు’(75), రాజరాజేశ్వరివిలాస్‌కాఫీక్లబ్, ‘అమెరికా అమ్మాయి’(76), ‘ఈనాటి బంధం ఏనాటిదో’(77), ‘ఒక అమ్మాయి కథ’(76), ‘సీతామాలక్ష్మి’(78), ‘కార్తికదీపం’(79), ‘మేఘసందేశం’(82), ‘వస్తాడేబావ’(77), ‘మేఘసందేశం’(82), ‘గోరింటాకు(79), ‘ఆనందభైరవి’(84), ‘రాక్షసుడు’(86).
అలుపు ఎరుగని జీవనదిలా తన భావగీతాలతో తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నంచేసారు. కేవలం 75 సినిమాలకు దాదాపు 180గీతాల మధుర స్మృతులను మనకు వదిలి 24-2-1980 న ఆ కళామతల్లి పదసేవకై తరలి పోయారు.
‘మావి చిగురు తినగానే’ – ‘ఆకులో ఆకునై’ ‘నీవుండే కొండపై’ ‘రాని కనీకోసంచెలి’, ‘ప్రతి రాత్రి వసంతరాత్రి’ -‘ఘనాఘనసుందరా’ – ‘పాడనా తెలుగుపాట’ -‘గోరింటా పూచింది’ ఈ పాటలు వాటిలోని భావపదవింటే పొంగని తెలుగు ఎద ఉండదు కదా!