గవర్నమెంట్ స్కూల్ సూపర్ విజయాలు: 600కి 598 మార్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు(D) మండలంలోని ఒప్పంగి ZP హై స్కూల్‌కు చెందిన విద్యార్థిని పావని చందు 600కి 598 మార్కులతో అద్భుత విజయాన్ని సాధించింది.
ఆమె ఇంగ్లిష్ సబ్జెక్టులో 99 మార్కులు. మిగిలిన సబ్జెక్టులన్నిటిలోనూ పూర్తి మార్కులు సాధించింది.
అలాగే అదే మండలం, అదే స్కూల్‌కు చెందిన మరో విద్యార్థిని అలవలపాటి చందన 595 మార్కులతో రెండవ స్థానంలో నిలిచింది.
ఈ విజయాలు ప్రభుత్వ పాఠశాలల విద్యను నమ్మి, కష్టపడి చదివితే ఎంత గొప్ప ఫలితాలు సాధించవచ్చో చక్కగా చూపిస్తున్నాయి.అభినందనలు విద్యార్థినిలకు మరియు వారి ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రుల కు పున్నమి పాఠకులు తరుపున అభినందనలు