ది: 05.09.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా
Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యుత్ ఏర్పాట్లు చేయాలి. డీజేలకు నిర్ణయించిన పరిమితులు, సమయాలను కచ్చితంగా పాటించాలి. నిమజ్జన ఊరేగింపుల్లో పోలీసుల సూచనలను అనుసరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Uploaded Video:


