గణహీనుని విద్య అనవసరం :డా.బెల్లంకొండనాగేశ్వరరావు. చెన్నై.

0
226

గణహీనుని విద్య అనవసరం
తనయింటి అరుగు పైచేరిన బాలలకు మిఠాయిలు పంచి ‘బాలలు సమాజానికి వినియోగపడని విద్య,ధనం,జీవితం అనవసరం. కోటిరూపాయలు సంపాదించి దాచుకోవడం వలన దాచిన వారే ఆనందించ గలుగుతారు.ఆధనంతోఒసంస్ధ స్ధాపించి పదిమంది బ్రతుకుతెరువు చూపించడంలో గొప్పతనంఉంది.సేవాగుణాన్ని సాటి ఈజగత్తులో మరేది లేదు.పద్యకథచెపుతానువినండి…
హీనుడెన్ని విద్యలభ్యసించిన గాని
ఘనుడు కాడు హీనజనుడు గాని
పరిమళములు మోయ గార్దభము గజమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ!
గుణహీనుడు ఎన్నిచదువులు చదివినా అనవసరం! పరిమళ ద్రవ్యాల మూటలు మోపున కట్టుకుని మోసినంత మాత్రాన గాడిద-గజరాజు కాలేదుకదా!
పూర్వం అమరావతి అనేఊరిలో శివయ్య అనే అతను తనఅంతా శ్రమించి నీటి పైనడవగలిగే విద్యనేర్చుకున్నాడు. అదిప్రదర్మిస్తూ వచ్చినధనం తో పొట్టనింపుకుంటూ జీవిస్తూ, దేశాటన చేస్తూ ఓనగరం చేరుకున్నాడు.
అక్కడ ఉన్న నదిలో తన విద్యప్రదర్మించి అందరిని యాచనచేస్తూచివరిగా ఒచెట్టుక్రింద స్వామిజి వద్దకు వచ్చాడు.ధ్యానంలోఉన్నస్వామిజి కళ్ళు తెరచి చూసేదాకాఆగి ‘స్వామి నేనుఅరవైసంవత్సరాలు శ్రమించి నీటిపైనడిచే విద్య అభ్యసించాను’అన్నాడు గర్వంగా.స్వామి చిరునవ్వుతో ‘నాయనా కొద్దిపాటి ధనం ఇస్తే పడవ లో సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు,నువ్యు ఇలా నదిలో నీటిపై నడవడం ఎంతప్రమాదమో ఆలోచించావా నీవిద్యప్రదర్మించేసమయంలో మొసలి వంటి జలచరాల వలన ప్రమాదం పొంచిఉంది.ఈవిద్యకోసం అరవైసంవత్సరాల జీవితం త్యాగం చేయాలా? ఇంతాచేసినేర్చినవిద్య నీకు ఎందుకు వినియోగపడు తుందియాచనకా? మనిషి జీవితం చాలా గొప్పది, నీతి, నిజాయితి, నిర్బయంగా,ఉన్నతంగా, ఆనందమయమైన జీవితం అనుభవించాలి,ఆసంతోషకరమైన జీవితంలో కొంతసమయ ం సమాజ సేవకు వినియోగించాలి. మనషి జీవిత లక్ష్యం అది, తెగిన గాలిపటంలా వెళుతూ లక్ష్యంలేని జీవితం అనుభవిస్తూ నువ్వు ఏంసాధించావు?’ అన్నాడు స్వామి.‘మన్నించండి స్వామి చెప్పే వారు లేక నా జీవితా సమయాన్ని అనవసరంగా నాశనం చేసుకున్నాను. శేషజీవితం సమయాన్ని సమాజ హితానికి వినియోగిస్తాను’ అన్నాడుశివయ్య. ‘నిజమే పెద్దలే పిల్లల అభిరుచి మేరకు వారి జీవిత గమనం, లక్ష్యం, నిర్దేశించాలి’ అన్నాడు స్వామి. ‘కథబాగుంది తాతయ్య’ అన్నారు పిల్లలు.’ బాలలు ఆస్వామి పేరు రామక్రిష్ణ పరమహంస’ అన్నాడు తాతయ్య.
డా.బెల్లంకొండనాగేశ్వరరావు. చెన్నై.