ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
വിശാഖപട്ടണം

గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 3 ::
క్రీడా రంగంలో నేలతేర్ గ్రామం లోడగలవానిపాలెం పంచాయతీ ఆనందపురం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) విద్యార్థినులు మరోసారి సత్తా చాటారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో శనివారం ఆనందపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థాయి అండర్-19 గట్కా (Gatka) పోటీల్లో KGBV ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని P. హేమ అద్భుత ప్రతిభ కనబరిచింది.

తన మేటి క్రీడా నైపుణ్యంతో ప్రత్యర్థులపై విజయం సాధించిన హేమ రాష్ట్ర స్థాయి గట్కా పోటీలకు ఎంపికై పాఠశాల కీర్తిని మరో మెట్టు ఎక్కించింది.

హేమ సాధించిన విజయంపై KGBV ప్రిన్సిపాల్ శ్రీమతి దొండా చంద్రకళ, PET బి. రమాదేవి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ హేమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, ఆనందపురానికి, విశాఖపట్నం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ చంద్రకళ ఆకాంక్షించారు.

హేమ విజయం పట్ల పాఠశాల చైర్మన్ కె. పావని, వైస్ చైర్మన్ వరలక్ష్మి, అధ్యాపక బృందం, తోటి విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

⭐ ప్రతిభకు పట్టం.. రాష్ట్ర స్థాయికి హేమ పయనం!

KGBV ఆనందపురం క్రీడా ప్రతిభకు మరో ఘనత

గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

గట్కా లో హేమ మెరుపు విజయం… రాష్ట్ర స్థాయికి దూసుకెళ్లిన కేజీబీవీ ఆనందపురం విద్యార్థిని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *