ఖమ్మం సాయి బాబా దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు – భక్తుల ఆహ్వానం
పున్నమి న్యూస్ – ఖమ్మం ప్రతినిధి నాగేంద్ర కుమార్ పువ్వాడ
ఖమ్మం నగరంలోని VDOS కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన (సోమవారం) ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులు శ్రీమతి మిక్కిలినేని మంజుల నరేంద్ర గారు భక్తులందరినీ ఈ పవిత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రోజున వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడనున్నాయి. మధ్యాహ్న సమయంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
సాయి బాబా భక్తులు అధిక సంఖ్యలో హాజరై దివ్య దర్శనం పొందాలని, ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.