*ఖమ్మం టూ టౌన్ పరిధి లో బీజేపీ ప్రబారిల నియామకం*.
పున్నమి ప్రతినిధి:(నాగేంద్ర కుమార్)
ఖమ్మం బీజేపీ టూ టౌన్ పరిధిలోని మొత్తం 15డివిజన్లకు ప్రబారిలను ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు, ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ ఆదివారం నియమించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సూచనల మేరకు ప్రబారీలను నియమించినట్లు వెంకట నారాయణయాదవ్ తెలిపారు. ఒక ప్రభారీకి ఒక డివిజన్ చొప్పున 15 డివిజన్లకూ 15 మందిని ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త, పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి వంచన లేకుండా కృషి చేసే విధంగా ప్రబారీలు పనిచేయాలని వారి డివిజన్ లకు వచ్చే ప్రభారీ లను గౌరవప్రదంగా ఆహ్వానించాలి అని , ఖమ్మం టూ టౌన్ పరిధిలో బిజెపి అభ్యర్థిలు గెలుపే లక్ష్యంగా ప్రతి డివిజన్ లోప్రతి బూత్ కి ప్రతి ఇంటికీ గడపగడపకు బిజెపి ని విస్తరించే విధంగా పనిచేయాలని సూచించారు. నియమించిన కమిటీని ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రబారి, మందడపు సుబ్బారావు, జిల్లా ప్రభారీ కోకన్వీనర్, జ్వాలా నరసింహారావు గౌడ్ లకు నియమించిన పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమం లో పి శ్రీనివాస్ రెడ్డీ, వేల్పుల సుధాకర్, జిల్లెల్ల నాగరాజు, యుగంధర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.