ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

0
83

ఖమ్మంలో జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు

ఖమ్మం ప్రతినిధి – పువ్వాడ నాగేంద్ర కుమార్

ఖమ్మం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ బారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల జూన్ 3 నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మండలంలో ఈ సదస్సులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజల నుంచి రావాల్సిన ఫిర్యాదులను స్వీకరించి, పారదర్శకంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సదస్సుల ద్వారా భూ హక్కుల సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, రెవెన్యూ రికార్డుల సరిచూసే విషయాలు మొదలైనవి చర్చించనున్నాయి. ప్రజలు తమ సమస్యలపై సదస్సుల్లో నేరుగా హాజరై విన్నవించుకోవాలని, ప్రభుత్వం వారి పక్షాన ఉంది అని అదనపు కలెక్టర్ అన్నారు.

ఈ చర్యల ద్వారా ప్రజలకు న్యాయం చేయడం, ప్రజా విశ్వాసం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

1
0