Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

Punnami Newsroom Published:
క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

Story highlights

  • బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
  • అనుముల కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
  • ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అనుముల కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగంపై మాట్లాడుతున్న రాహుల్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ద్వారా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ఆధారాలతో ప్రశ్నించిన వారిని జైలుకు పంపడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *