కొల్లాయి గట్టితేనేమి” గ్రంథావిష్కరణ: డా.ఏనుగు నరసింహారెడ్డి

0
200

కరీంనగర్ అదనపు జిల్లా పాలనాధికారి శ్రీ డా.ఏనుగు నరసింహారెడ్డి గారు,సంస్కృతి పరిరక్షణ సేవా సమితి,హైదరాబాద్ సంస్థ గాంధీ జీవితం,ఆదర్శాలు,వ్యక్తిత్వం పై నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన కవితలతో ప్రచురించబడిన “కొల్లాయి గట్టితేనేమి” 90 మంది కవుల కవితా సంకలనాన్ని కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి శ్రీ డా. ఏనుగు. నరసింహారెడ్డి గారు17 గురువారం సాయంత్రం తమ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జీవితంపై ఎన్ని కవితా సంకలనాలు వచ్చినా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయని,ఆ మహనీయుని జీవితం,మార్గం సదా ఆచరణీయాలని అన్నారు”జాతీయోద్యమంలో చెరగని ముద్ర వేసిన జాతిపిత, మహాకవి రవీంద్రనాధ్ ఠాగూర్ చే ‘మహాత్మా’ అనిపించుకున్న నిరాడంబరుడు,రవి అస్తమించని సామ్రాజ్యపు పునాదులను సత్యాహింసలతో కదిలించిన స్వరాజ్య సమరయోధుడు మహాత్మాగాంధీ” అని అన్నారు”గ్రామ స్వరాజ్యం కోసం పరితపించిన గాంధీ కులవృత్తులను గౌరవించారని,అస్పృశ్యతా నివారణ కు కంకణం కట్టుకున్న గొప్ప సంస్కర్త”అని సంస్కృతి పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చింతపట్ల వెంకటరమణాచారి మౌనయోగి అన్నారు.కార్యక్రమంలో చింతపట్ల వెంకట రమణాచారి, ఉదయసాహితి కరీంనగర్ అధ్యక్షులు,కవి శ్రీ వైరాగ్యం. ప్రభాకర్,అండాల్ ప్రింటర్స్ అధినేత శ్రీ ఎర్రమరాజు. రామరాజు, కొల్లాయి గట్టితేనేమి కవితా పోటీలో ద్వితీయ బహుమతి పొందినశ్రీమతి సి.హెచ్.రజిత తదితరులు పాల్గొన్నారు.

0
0