संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి: వెంకటేశ్వరరావు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి: వెంకటేశ్వరరావు

खबर की मुख्य बातें

  • Uploaded Video:

అమలాపురం ధర్నాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు ధ్వజం.

​అమలాపురం,పున్నమి తెలుగు దినపత్రిక: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు,విశ్రాంత ఉద్యోగుల (పెన్షనర్ల) న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఆర్పిఏ జిల్లా అధ్యక్షుడు కడలి సత్యనారాయణ అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ‘చలో కలెక్టర్ కార్యాలయం’ ధర్నా నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ​దేశాన్ని, రాష్ట్ర అభివృద్ధిని తమ శ్రమతో నిలబెట్టిన ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ, వేల కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఐ.వి. గారు విమర్శించారు. దశాబ్దాల తరబడి సేవ చేసిన ఉద్యోగ విరమణ పొందిన వారికి కనీస జీవిత భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ​పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025 రద్దు: కోట్లాది మంది పెన్షనర్ల ప్రయోజనాలకు భంగం కలిగించేలా రూపొందించిన పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. .8వ పీఆర్‌సీ & మధ్యంతర భృతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్‌సీ నివేదికను త్వరగా రప్పించి, 01.01.2026 నుండి అమలు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు తక్షణ ఉపశమనం కింద మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు .
EPS 95 పెన్షనర్లకు న్యాయం: ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9,000/- కి పెంచి, దానికి కరవు భత్యం (డిఎ) తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుల అమలు: హయ్యర్ పెన్షన్ అమలుపై కోర్టులు ఇచ్చిన అనుకూల తీర్పులను ఎటువంటి మెలికలు లేకుండా తక్షణమే అమలు చేయాలని కోరారు.

పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఎన్పీఎస్ , సిపిఎస్, యుపిఎస్ విధానాలను రద్దు చేసి, రక్షణనిచ్చే పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు.

రైల్వే, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకింగ్ రంగ సమస్యలు: పోస్టల్, బిఎస్ఎన్ఎల్ , బ్యాంకింగ్ రంగాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రతిపాదనలను, సమస్యలను వెంటనే పరిష్కరించాలి​12వ పీఆర్‌సీ & 30% IR: రాష్ట్రంలో తక్షణమే 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి (IR) ప్రకటించాలి.

పెండింగ్ DA ల విడుదల: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 5 విడతల డియర్‌నెస్ అలవెన్స్ (DA) బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

రూ. 25,000 కోట్లతో స్పష్టమైన షెడ్యూల్: ఉద్యోగులు, పెన్షనర్లకు రావలసిన రూ. 25,000 కోట్ల పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లించడానికి స్పష్టమైన టైమ్‌టేబుల్/షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలి.

కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ: కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం అందించాలి.

అసంఘటిత రంగ కార్మికులకు ఈపీఎఫ్& పెన్షన్: అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికుల వేతనాల నుండి ఈపీఎఫ్ (ఈపీఎఫ్) చందాను మినహాయించి, వారికి సామాజిక భద్రతతో కూడిన పెన్షన్ సదుపాయం కల్పించాలి. ఈ ధర్నా కార్యక్రమానికి పలు ప్రజా సంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి ఎస్. సూర్యనారాయణ, యుటిఎఫ్ అఅధ్యక్షులు జీవి రమణ, గౌరవ అధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి,ఎన్. బలరాంకౌలు రైతు సంఘం జిల్లా నాయకులు , బుంగ సత్యనారాయణ, వ్య. కా. సంఘం జిల్లా నాయకులు కారుపల్లి గోపాలన్,మిడ్డే మీల్ సంఘం జిల్లా కార్యదర్శి టీ. నాగ వరలక్ష్మి, జి దైవ కృప సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ ​కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కడలి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.వి. గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు డి. శ్రీరామ్మూర్తి, మూర్తి ,యాదవ్, కే వి రమణ, బ్రహ్మనడం, రెడ్డివెరస్వామి, పెద్దిరెడ్డి రామకృష్ణ,మూర్తి, డి రాధకృష్టన్, పి కామేశ్వరరావు, ఎం శ్రీరాములు, మోహనరావు, నరసింహ మూర్తి జిల్లా కార్యదర్శులు ఎస్.రామకృష్ణ, కే. త్రిమూర్తులు, కండవల్లి శ్రీనివాస్, డి. నాగేంద్ర రాజు, పి. కొండలరావు, జి.రవికుమార్, బి.ఎన్ శివకుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Uploaded Video:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి: వెంకటేశ్వరరావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *