కెరీర్ లో గుడ్ విల్ పెంచుకోవడం ఎలా ? 5 మార్గాలు !

0
197
కెరీర్ లో గుడ్ విల్ పెంచుకోవడం ఎలా ? 5 మార్గాలు !

ముందు గా , పున్నమి పాఠకులకు లేటు గా అయినా, నూతన సంవత్సర & సంక్రాంతి శుభాకాంక్షలు !

సంస్థలలో పని చేసే కొందరు ఉద్యోగులు, చాలా త్వరగా గుర్తింపు, ‘ వెయిట్ ‘ , ఇంఫ్లూయెన్సు, మంచి గుడ్ విల్ సంపాదించుకుంటారు ! అది అందరి వల్లా కాదు ! వారు మీటింగ్ లలో ఏదైనా సమస్యలు లేవనెత్తినా, లేదా పరిష్కారాలు సూచించినా , సీనియర్ లు, పై అధికారులూ, వారి మాటలు వింటారు , వారిని సీరియస్ గా తీసుకుంటారు .

అలాంటి వారు, హోదా, అధికారం సూచించే పై పొజిషన్ లలో లేక పోయినా, వారి మాటకు వెయిట్ ఉంటుంది . దీనిని మేనేజిమెంట్ పరిభాభ లో ‘ గ్రావిటాస్ ‘ ( ఇంగ్లీష్ ) అంటారు ! మనం మన భాష లో దీనిని ‘ గుడ్ విల్ ‘ అందాము అయితే, లీడర్ షిప్ క్వాలిటీస్ లాగా, ఈ ‘ గ్రావిటాస్ ‘ అనేది  పుట్టుక తో రాదు ! పెంపొందిచుకో వచ్చు సంస్థలలో పని చేసే ప్రతి ఉద్యోగీ , కష్టానికి తగ్గ ప్రతిఫలం , జీతం తో పాటు , కొంత వ్యక్తిగత గుర్తింపూ , ఆఫీసు లో తన మాటకు విలువ ఇవ్వాలనీ , కోరుకుంటారు . స్త్రీలయినా పురుషులయినా . దీనిలో తప్పేమీ లేదు .ఈ గుడ్ విల్ పెంపొందిచుకోవడానికి కొన్ని మార్గాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం ‘ఇలా చేస్తే, అలా ఫలితం వస్తుంది ‘ అని నేను గ్యారంటీ ఇవ్వలేను . కానీ , గుడ్ విల్ పెరిగే అవకాశాలు మెరుగవుతాయి. ఇది మీరు ఆత్మ విమర్శ చేసుకోవడానికి కూడా ఉపయోగ పడుతుంది . వీటిలో మీరు ఏవేవి చేస్తున్నారు  ? ఏవేవి చేయటం లేదు ? అలా ! పని చేసే సంస్థలలో గుడ్ విల్ లేదా గ్రావిటాస్,  పెంచుకోవడానికి మార్గాలు.

(1) మొదట గా సమయ పాలన . ఆఫీస్ టైం 9.30 కి అనుకోండి . 9.40 కి కాకుండా , 9.20 కల్లా  వచ్చేయడం అలవాటు చేసుకోండి . 9.30 లోగా పని మూడ్ లో కి , ఫ్లో లోకి వచ్చేయండి .

(2) మీరు సేల్స్ లో కానీ , షాపు లో కౌంటర్ సేల్స్ లో కానీ , కస్టమర్ సర్వీసు లో కానీ , బిజినెస్ డెవలప్మెంటు లో కానీ ఉన్నారా ? మీకు టార్గెట్ లు ఉన్నాయా ? లేక మీ ఉద్యోగం లో బాగా చేశారు అనడానికి కానీ , బాగా చేయలేదు అనడానికి కానీ , ఈ యీ ఫలితాలు సాధించారు/  సాధించ లేదు అనడానికి పనితనానికి కొలబద్దలు ( కీ రిజల్ట్ యేరియాస్ ) ఉన్నాయా ? ఆ ఫలితాలు సాధించడానికి మీరు చేయవలసిన పనులు ఏవేవి ? ( కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్ లు ) .  ఈ పనులను బాగా చేయండి . మన ఉద్యోగం ద్వారా మన పై అధికారులు ఏమేమి ఫలితాలు మన నుంచి ఆశిస్తున్నారు ? అనే దాని పైన స్పష్టమైన అవగాహన ఉన్న వారు త్వర గా క్యారీర్ లో పైకి వెళతారు .

(3) మన వృత్తి విలువల పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి . అసలు మనకేమి కావాలి ? ఎందుకు కావాలి ? ఇలా మనని మనం అర్ధం చేసుకుంటే, ప్రంచాన్ని అర్ధం చేసుకోవడం సులభం అవుతుంది .

ఉదాహరణకి ” ఎవరైనా నన్ను వర్ణించే టప్పుడు ( నేను వారి సమక్షం లో లేనప్పుడు ) , వారు నన్ను ఎలా వర్ణించాలని నేను ఆశిస్తాను ? ఏ యే గుణగణాలని వారు ప్రశంసా పూర్వకం గా చెప్పాలని నేను ఆశిస్తాను ? ” అని మీకు మీరు ప్రశ్న వేసుకోండి . నాలుగైదు అలాంటి వృత్తి విలువలు రాసుకోండి ఏ పేపర్ మీద అయినా . ఆ విలువలు దైనందిక వృత్తి జీవితం లో పాటించండి .

వృత్తి విలువల కు ఉదాహరణలు : ఫలితాలు, కనుగోలుదారుల సంతృప్తి , కంపెనీ వృద్ధి , నిజాయితీ, సేవా భావం , మంచి టీం ప్లేయర్  గా నలుగురి పని లో సహాయ పడడం , పని పట్ల వ్యక్తిగత నిబద్ధత , కష్టించి పని చేసే స్వభావం , వ్యాపారం లో నైతిక విలువలు , మాటకు కట్టు బడడం . ఇవన్నీ వృత్తి విలువలకు ఉదాహరణలు .

(4) ఒక్కో సారి మనం బాగానే చేస్తున్నాము అన్న భ్రమ లో ఉంటాం . కానీ మన చుట్టూ ఉన్న వారు అలా అనుకోక పోవచ్చు ! ఆ సమన్వయం కుదరడానికి ‘ ఫీడ్ బ్యాక్ ‘ ను ఆశ్రయించాలి . మనం పని బాగానే చేస్తున్నామా ? ఇంకా ఏమైనా మెరుగు పరుచుకోవచ్చా ? పని మరింత తక్కువ సమయం లో చెయ్యడానికి , మరింత నాణ్యత పెంచ డానికి , మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్ట డానికి , మరింత తక్కువ ఖర్చు తో చేయడానికి , మనం అదనం గా ఏమైనా చేయ గలమా ? ‘ కొంతమంది శ్రేయోభిలాషుల తో ఈ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి . దానిని మన దైనందిక జీవితం లో పాటించాలి.

(5) చొరవ : ఒక్కో సారి మన సంస్థ క్లిష్ట పరిస్థితులలో ఉంటుంది . మనని ఒక గంట అదనం గా పని చెయ్యమనో ( ఒక నెల రోజులు, 2 నెలలు ) , లేదా, వారం పని 5 రోజులలో చెయ్యమనో , మనం చేసేది కాక అదనపు పని ‘ ఎవరు తీసుకుంటారు ? ‘ అని మీటింగు లో పై అధికారులు అడిగినప్పుడు ‘ నేను చేస్తాను ! ‘ అని అందరికంటే ముందుగా చెయ్యి పైకి ఎత్తండి ! దాని వల్ల అప్పుడు మీకు రూపాయి అదనపు జీతం రాక పోయినా కూడా ! ఫలితాలు దీర్ఘ కాలం లో ఉంటాయి .

పై 4 విషయాలు పాటిస్తే , మనం పని చేసే చోట మన గుడ్ విల్ పెంచుకోవచ్చు . అది మన క్యారీర్ లో మరింత ముందుకు వెళ్ళడానికి సహాయ పడుతుంది .

ఇవే ఫైనల్ అని కాదు . పైవి కాక , మరే లక్షణాలు అయినా మన గుడ్ విల్ పెంపొందిస్తాఇ అని మీరు అనుకుంటే, ఈ క్రింది అడరసులకి మెయిల్ చెయ్యండి . మీ ఫీడ్ బ్యాక్ . మా ఆర్టికల్ ల నాణ్యతని మీ ఫీడ్ బ్యాక్ ద్వారా మరింత మెరుగు పరుచుకుంటాము .

essence.training@yahoo.com  & punnami.news@gmail.com

2021 లో మీకు ఆరోగ్యాలు  బాగుండాలని , మీకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ,