संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

కూటమి ప్రభుత్వ అభూత కల్పనలు ప్రజల అర్థం చేసుకున్నారు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కూటమి ప్రభుత్వ అభూత కల్పనలు ప్రజల అర్థం చేసుకున్నారు

खबर की मुख्य बातें

  • కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత.
  • "వైయస్సార్సీపి సంస్థాగత బలోపేతం" -మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వాడ వాడలా కోటి సంతకాల సేకరణ.
  • -కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత.

కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత.

“వైయస్సార్సీపి సంస్థాగత బలోపేతం”

-మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వాడ వాడలా కోటి సంతకాల సేకరణ.

-కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత.

-నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్.

పెరవలి, అక్టోబర్ 30 :

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నేతృత్వంలో సంస్థాగత పటిష్టవంతంగా ప్రజలలో మమేకం అయిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, అభూత కల్పలను ప్రజలు అర్థం చేసుకున్నారని నిడదవోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అన్నారు.

వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. నిర్మాణాత్మకంగా మనం ప్రజల ముందుకు వెళ్లి మళ్లీ జగనన్నను సీఎం చేయాలన్నారు. రానున్నది జగనన్న కార్యకర్తల ప్రభుత్వం అని గుర్తించాలన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రజల్లో మమేకమై పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను మళ్లీ సీఎంను చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. త్వరలో ప్రతి ఒక్కరికి పార్టీ ఐడి కార్డులు సైతం ఇస్తుందని చెప్పారు.

పెరవలి, ముక్కామల గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కోటి సంతకాల కార్యక్రమానికి సంబంధించి పార్టీ శ్రేణులతో పెరవలి గ్రామంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జ్ జి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జగనన్న ప్రభుత్వంలో నిర్వహించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కి ప్రజలను దారుణంగా మోసం చేసిందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అన్నారు.

ముక్కామల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వివరించారు. స్థానికులు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి గవర్నర్ కి ఇచ్చే కోటి సంతకాల సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాల్లో భాగంగా సంతకాలు చేసి సెల్ఫోన్ నెంబర్లు సైతం వేయడం విశేషత సంతరించుకుంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ..రచ్చబండ కార్యక్రమాలను వివరిస్తూ కోటి సంతకాల కార్యక్రమం పై ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడులు పెరవలి లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీ శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వైఎస్ఆర్సిపి సంస్థగత పటిష్టతకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా
జి శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *