కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి కానీ మా కార్యకర్తలను వదిలేయండి – కాకాణి పూజిత.
పొదలకూరులో గాండ్ల అమావాస్య సందర్భంగా పూజలు చేసిన కాకాణి పూజిత, తండ్రి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఖండించారు. రాజకీయ కక్షతో పి.టి. వారెంట్లు వేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు” అంటూ ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.