” క్యారీర్ నిర్వహణ ”
మనలో చాలా మంది స్వయం ఉపాధి కంటే , చిన్న వ్యాపారానికంటే , చిన్నదో పొన్నదో , నెలకింత వచ్చే ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తాం . ఇది తప్పు కానే కాదు , దీనికి కారణం లేక పోలేదు . మనకి నెలవారీ ఖర్చులు , ఇంటి అద్దె, పాలు, పేపరు , వెచ్చాలు, కూర గాయలు, పిల్లల ఫీజులు , అన్నీ , నెలకింత అని ఫిక్సెడ్ గా ఉంటాయి . కాబట్టి నెలకింత అని వస్తే, ఖర్చులకు కేటాయించి , మిగిలినా మిగలక పోయినా, అదో మనశ్శాంతి పెళ్ళి కాని యువకులకు కూడా, స్వయం ఉపాధి / చిన్న వ్యాపారం అంటే, పిల్లను ఇవ్వడం కూడా కష్టమే ! ” బిజినెస్సా ? వద్దులే ! ఉద్యోగస్తుడిని చూడండి డ్యాడీ ! ” అనే అమ్మాయిలు కూడా ఎక్కువే. కానీ, ఇదంతా, కరోనా ముందరి వ్యవహారం ! మానవ జాతి ఇటీవలి చరిత్ర ను ‘ కరోనా కి ముందు, తరువాత ‘ అని విభజించుకోవాల్సిన పరిస్తితి . ఇప్పుడు పనులు లేవా ? అంటే ఉన్నాయి . కానీ , ఉద్యోగాల రూపం లో కాక, కాంట్రాక్టు పనుల ‘ రూపం లో ఉన్నాయి . దీనిని ఇటీవలి ఇంగ్లీష్ లో ‘ గిగ్ వర్క్ ‘ అంటారు . కాంట్రాక్టుల మీద పెద్ద ఆర్ధిక వ్యవస్థే ఉంది . లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి . దీనిని ‘ గిగ్ ఎకానమీ ‘ అంటున్నారు .ప్యాండమిక్ తరువాత, ఈ కాంట్రాక్టు పనులకు, అనగా, ఈ గిగ్ వర్క్ లకు గిరాకీ పెరిగిందట .దాదాపు 20% నుంచి 25% పెరిగిందట . ఎలాంటి పనులకు ? చూద్దాం . ఉదాహరణ కి ఒక వ్యక్తి సేల్స్ ఆఫీసర్ గా పని చేస్తూ , ఉద్యోగం కోల్పోయారు అనుకోండి , కరోనా వల్ల .మరొక కంపెనీ లో సేల్స్ / మార్కెటింగ్ ఉద్యోగం కోసం అప్లయి చేసీ చేసి, వేచి ఉండి సుదీర్ఘ కాలం నిరీకించే కంటే , ఏదో ఒక కంపెనీ వారితో మాట్లాడి , తాను అమ్మ గలిగిన ప్రాడక్టు ని ‘ కమిషన్ బేసిస్ ‘ మీద తీసుకుంటే మంచిది . చిరుద్యోగాలూ దొరకడం కరువైన వేళ, నిరుద్యోగం తో బాధ పడడం కంటే, ఇలా కమిషన్ ఆధారిత సంపాదన కోసం చూడడం మంచిది. కొంత కంప్యూటరు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి , కాంట్రాక్టు పనుల గిరాకీ పెరిగింది . ఉదాహరణకి వెబ్ డిజైనరు లు , కంటెంట్ రాసే వారు , డాటా అనాలిసి స్ చేసే వారు , డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ , యాప్ లు డెవలప్ చేసే వారు , సైబర్ సెక్యూరిటీ చూసే వారు , మరియు కోడింగ్ చేసే వారు వీరికి డిమాండు పెరిగింది . కాంట్రాక్టు పనుల రూపంలో. గిగ్ వరకు చేసే వారికి మరో సౌకర్యం కూడా ఉంది . ఉద్యోగం లో ఉండే ఆరోగ్య బీమా , ఇతర భత్యాలు అలవెన్సు లు లేనప్పటికీ – ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు . రోజు ఆఫీసు కి వెళ్లే పని లేదు . పెళ్లి అయి పిల్లలు ఉంది , ఉద్యోగం సంపాదన అవసరం ఉన్న మహిళలకు కాంట్రాక్టు పనులు సూట్ అవుతాయి .అలానే, ఒక మంచి ఐ టి కంపెనీ లో అకౌంటెంటు గా ఉండి, ప్యాండమిక్ కారణం గా ఉద్యోగం కోల్పోయిన మిత్రుడు , జి ఎస్ టీ , టాక్సేషన్ పనులు నేర్చుకుని , ఒక పది షాపు లకు ఆ గి ఎస్ టి పనులు చేస్తున్నాడు. 3 నెలలకు ఒక సారి ఫీజులు ఇస్తారు . ప్రయివేటు స్కూలు / కాలేజీ ఉపాధ్యాయ బృందం , ట్యుషన్ లు చెప్పడం ప్రారంభించారు. కాబట్టి, ఈ ప్యాండమిక్ కారణం గా మీరు ఉపాధి కోల్పోయి ఉంటే, అదే పనిని ఉద్యోగ రూపం గా కాకుండా , గిగ్ వర్కు రూపం లో చేయ గలరేమో ప్రయత్నించండి . ఇది ఉద్యోగానికి ప్రత్యామ్నాయం కాదు కానీ, నిరుద్యోగం కంటే మేలు.వ్యాపారం పెట్టిన వారి దృష్టి నుంచి ఆలోచిస్తే, లాభం వచ్చినా రాకున్నా , నెలకింత అని ఇవ్వాలంటే వారికీ కష్టం . పని జరిగితే నే, ఆ పని ద్వారా ఆదాయం ఉంటేనే, పేమెంటు – అనే పద్ధతి వారికీ ఆమోద యోగ్యం కావచ్చు.ఇప్పుడున్న పరిస్థితులలో మన ప్రిఫరెన్సులు పక్కన పెట్టి, ఏ పని దొరికినా స్వీకరించడం మేలు. పని లో పని గా , కొత్త నైపుణ్యాలను పెంపొందిచు కోవడం కూడా.