తెలుగు సాహిత్యాన్ని తన శ్వాసగా చేసుకున్న డాక్టర్ జుంజూరి అమృత రావు గారు విశాఖపట్నం జిల్లాలోని గొరపల్లి, పెందుర్తి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పుట్టిన ఊరు శృంగవరపుకోట కాగా, తల్లిదండ్రులు ఆరోగ్య మేరీ జోషఫ్.
వారి జీవిత లక్ష్యం: విద్యారంగ సేవతో పాటు సాహిత్య వికాసం. “రాజశ్రీ కవిరత్న”, “ఆంధ్ర లెజెండ్”, “సహస్ర కవి కిరణం”, “కళామంది అవార్డు” వంటి ప్రతిష్టాత్మక బిరుదులను పొందిన గౌరవనీయులు. 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆయన సాహితీ మరియు శిక్షణా ప్రయాణంలో మైలురాయిగా నిలిచింది.
సామాజిక సేవ, తెలుగు కళా పరిరక్షణ పట్ల వీరి నిబద్ధత, పరిశ్రమ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. పద్యానికి ప్రాణం పోసే ఈ కవి, సామాజిక విలువలు గల రచనల ద్వారా తెలుగు భాషను కొత్త శిఖరాలకు చేర్చుతున్నారు.
content is good
content sample comment
text comment