కళ్ళులేని కబోది ఎవరు మీరా మేమా

    0
    198

    పొదలకూరు మండలం మొగళ్లూరు వద్ద నీళ్లు లేక ఎండిన కండలేరు ఎడమ కాలువలో మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు..

    కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్ ఆన్ చేసి రెండు నెలలవుతోంది. లిఫ్ట్ ఆన్ చేసి నిమ్మతోటలను కాపాడాలని మా నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరితే నోటికొచ్చినట్టు మాట్లాడుతారా

    పొదలకూరు మండలంలోని ఎడమ కాలువకు నీళ్లివ్వమంటే వెంకటగిరి నియోజకవర్గంలోని పిన్నేరు కాలువకు నీళ్లిచ్చామంటారా

    నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులు కండలేరు ఎడమకాలువలోకి వచ్చి చూడండి కళ్లు ఎవరికి కనబడటం లేదో తెలుస్తుంది

    కండలేరు డ్యాంలో 3 టీఎంసీల నీళ్లున్నప్పుడే రైతుల కోరికమేరకు మా నాయకుడు సోమిరెడ్డి 15 రోజులకు ఒకసారి నీళ్లిచ్చి నిమ్మతోటలను కాపాడిన విషయం మీరు మరిచిపోయినా.. రైతులు మరిచిపోరు

    ఇప్పుడు 26 టీఎంసీలున్నా నీళ్లు విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, నీళ్లివ్వమని కోరిన వారిపై కల్లు తాగిన కోతుల్లా మాట్లాడటాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం

    వావింటపర్తి పంచాయతీ కూడా పొదలకూరు సర్కిల్ పోలీసుస్టేషన్ పరిధిలోనిదే అనే విషయాన్ని దాచిపెట్టాలనుకుంటున్నారా

    ఊచపల్లిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి ఇరువర్గాలను సీఐ పిలిచి మందలించి పంపేస్తే, ఎస్సై టీడీపీ కార్యకర్తలను రెండోసారి పిలిచి రాత్రంతా పొదలకూరు స్టేషన్ ఉంచి ఇబ్బంది పెట్టడం వాస్తవం కాదా

    అవినీతి గురించి మీరా మాట్లాడేది దోచుకుని దాచుకుంటున్నదెవరో మీ పార్టీ ముఖ్య నాయకులే చెబుతున్నారు

    ఏడాదిలోనే జరిగిన అవినీతిని లెక్కలతో సహా చెప్పిన మీ నాయకుల మాటలను సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ వింటున్నారులే

    ఎవరి ప్రభుత్వంలో అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు.

    ఇప్పటికైనా అవాస్తవాలు మాట్లాడటం మానుకుని కండలేరు నుంచి నీళ్లు వదిలి నిమ్మ తోటలను కాపాడండి. ఈ కార్యక్రమంలో లో పొదలకూరు మండలం టిడిపి నాయకులు రఘురామి రెడ్డి, మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు.