రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కలువాయి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 30 మంది సిబ్బందికి యూనిఫామ్ మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది దాత బండి వేణుగోపాల్ రెడ్డి స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ ఆంజనేయులు చేతుల మీదగా సిబ్బందికి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దాత బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే వాళ్ళకు సేవ చేసే దానికి డాక్టర్లు పోలీసులు శానిటేషన్ సిబ్బంది నిత్యం విధుల్లో ఉంటూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని అటువంటి వారికి అండగా నిలవాలని నేడు డక్కిలి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఇప్పటికే రాపూరు మండలంలో ప్రతి ఇంటికి కూరగాయలు మరియు పండ్లు, గుడ్లు పంచామని, రాపూరు టౌన్ లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి నిత్యవసర సరుకులు కూరగాయలు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కరోనా లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను సంప్రదించినట్లయితే వెంటనే వారి సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు.కలువాయి ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ పోలీసులు సేవలను గుర్తించి మాకు యూనిఫామ్ , మాస్కులు పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి గారికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రత్యేకంగా కలువాయి పోలీస్ స్టేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భవిష్యత్తులో బండి వేణుగోపాల్ రెడ్డి గారు సేవలు ఇలాగే కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.పై కార్యక్రమంలో కలువాయి మాజీ జెడ్పటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, కలువాయి మాజీ మండల ఉపాధ్యక్షులు మాలేపాటి వెంకట కృష్ణారెడ్డి,SI ఆంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దితరులు పాల్గొన్నారు.