खबर की मुख्य बातें
- *ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఎండ్లూరి వెంకటేష్ చౌదరి - భక్తులకు దసరా శుభాకాంక్షలు!* నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ జ్వాలాముఖి మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.ప్రతి ఏటా లాగే…
- ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా *ఎండ్లూరి వెంకటేష్ చౌదరి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు.
- అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపాడు గ్రామంలో జ్వాలాముఖి మహంకాళి అమ్మవారు అత్యంత మహిమాన్వితమైన దేవత అని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు.
*ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఎండ్లూరి వెంకటేష్ చౌదరి – భక్తులకు దసరా శుభాకాంక్షలు!*
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ జ్వాలాముఖి మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా *ఎండ్లూరి వెంకటేష్ చౌదరి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపాడు గ్రామంలో జ్వాలాముఖి మహంకాళి అమ్మవారు అత్యంత మహిమాన్వితమైన దేవత అని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరూ అమ్మవారి ప్రేమానురాగాలకు, కృపకు పాత్రులు కావాలని కోరుకున్నారు.*పది రోజుల పాటు ఉత్సవాలు:*గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా దసరా పండుగ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రతి రోజు అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కావున భక్తులందరూ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ, ఆలయ కమిటీ గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళా భక్తులు, చిన్నారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.