ముమ్మిడివరం మండల కర్రివానిరేవు గాడిలంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీమతి మోర్త శాంతి శ్రీ వీర సూర్జం గారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
