కరోనా వ్యాధి .. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.

0
277

కరోనా వ్యాధి …..మూడు రోజుల్లో లక్ష మందికి
కరోనా అతి భయంకరమైన అంటువ్యాధిగా మారింది.గత డిసెంబర్లో చైనాలో పుట్టింది.
మూడు నెలల్లోనే ప్రపంచంలోని దేశాలన్నింటికీ పాకింది. ఈరోజుకి 3,95,564 మందికి సోకింది. 17,233 ప్రాణాలను బలితీసుకుని ప్రపంచ జనాభానంతా గడగడలాడిస్తుంది. 22వ తేదీ మన దేశంలో జరిగిన స్వచ్ఛంద గృహనిర్బంధ కార్యక్రమాన్ని పరిశీలించినట్లయితే ప్రజలు ఎంత భయానికి లోనవుతున్నారో తెలుస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి గణాంకాలను పరిశీలిస్తే ప్రజల భయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి.
ప్రపంచ వ్యాపితంగా కరోనా
సోకిన వారి సంఖ్య లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పట్టింది. మరో 11 రోజులలోనే ఈసంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. మరో మూడు రోజులలోనే ఈ రెండు లక్షలు సంఖ్య మూడు లక్షలు గా మారింది. 23వ తేదీ ఒక్క రోజే 41,371మందికి సోకింది. ఈ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ప్రజల భవిష్యత్తు ఏమిటన్నది పెద్ద ప్రశ్న.
సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా చైనా తన దేశంలో పుట్టిన ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోగలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇటలీలో మరణ మృదంగం మోగుతుంది. ఈ వ్యాధి ని అదుపు చేయలేక అల్లాడి పోతుంది. ఈ వ్యాధి గురించి భయపడి పోవడం కాదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.