కరోనా రెండవ దశ కట్టడికై ఈ చర్యలు చేపట్టాలి

0
248

‌ప్రభుత్వాన్ని కోరిన ప్రజా ఆరోగ్య వేదిక

గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విజ్పింబించి , మన రాష్ట్రాన్ని కూడా కుదిపేసిన కరోనా మహమ్మారిని మరియు దాని వల్ల సంభవించిన మరణాలను ప్రభుత్వం సమర్ధవంతంగా సకాలంలో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి దశని కట్టడి చేయగలిగామని ప్రజా ఆరోగ్య వేదిక తెలియచేస్తున్నది.
ఇప్పుడు మళ్ళీ కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రస్తుతం రెండవ దశ కరోనా సంఖ్యలో మనదేశం ప్రపంచం లో మూడవ స్థానంలో ఉంది. అనేక రాష్ట్రాలలో తీవ్ర రూపం దాల్చి రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో పరిస్థితులు విషమించడం వల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మళ్ళీ లాక్డవున్లు మరియు కఠిన మైన కట్టడి చర్యలు ఇప్పటికే తీసకుంటున్నాయి. మనరాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందువల్ల కరోనా రెండవ దశ కట్టడికై ఈ క్రింది చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డికి ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి చేయుచున్నది.
1. టెస్ట్, ‌ట్రేస్‌ ‌మరియు ట్రీట్‌ (‌టిటిటి) కార్యక్రమాన్ని మళ్ళీ పూర్తిగా అమలు చేయాలి. టెస్టుల సంఖ్యని పెంచాలి.
2. కాంటాక్ట్ ‌సోర్సు వ్యక్తులను గుర్తించాలి.
3.వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వ అ ఆధ్వర్యంలో పూర్తి వైద్యం అందించాలి.
4.కోవిడ్‌ ఆసుపత్రుల సంఖ్యను పెంచి తగినంత మంది వైద్యులు మరియు వైద్యేతర సిబ్బందిని నియమించాలి.
5. మందులు, పిపిఈ కిట్లు, లేబరేటరీలు లాంటి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
6. ప్రజలందరితో, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో సహా ఎస్‌ఎంఎస్‌ (‌భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్‌ ‌చేసుకోవడం) విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి.

6. ‌ప్రజలందరితో, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో సహా ఎస్‌ఎంఎస్‌ (‌భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్‌ ‌చేసుకోవడం) విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి. దీని అమలు కోసం ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
7.కాలేజీ, స్కూళ్ళ యాజమాన్యాల వైఫల్యం మరియు విధానం సరిగా అమలు చేయక పోవడం వల్ల కరోనా వ్యాధి పెరుగుదలకు పాఠశాలలు మరియు కళాశాలలు కేంద్రంగా మారుతున్నాయి. కనుక ఎస్‌ఎంఎస్‌ ‌విధానం సరిగా అమలు చేయని యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తాత్కాలికంగా స్కూళ్ళు కాలేజీల నిర్వహణను నిలుపుదల చేయాలి.
8.బారులు, మధ్యం దుకాణాలు, మాల్స్, ‌బజారులు, పబ్లిక్‌ ‌మరియు ప్రయివేట వాహనాలలో ప్రయాణీకుల పట్ల, బస్‌ ‌స్టేషన్‌, ‌రైల్వే స్టేషన్‌ ‌ప్రాంగణాల వద్ద కోవిడ్‌ ‌కట్టడి ప్రోటోకాల్‌ అమలు చేయాలి. అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలి 9. కరోనా వ్యాక్సిన్‌ ‌ప్రజలందరికీ ఉచితంగా అందించాలి.
10. కరోనా వ్యాక్సిన్‌ ‌వేయించుకోవడానికి ప్రజలు భయ పడుతున్న కారణంగా ప్రజలందరూ వేయించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి.
11. గ్రామస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం వైద్యుల పర్యవేక్షణ లేకుండానే జరుగుతుంది. అలా కాకుండా ప్రాథమిక వైద్య సదుపాయాలతో, అంబులెన్స్ అం‌దుబాటులో, వైద్యుల ఆధ్వర్యంలోనే కరోనా వ్యాక్సిన్‌ ‌నేషన్‌ ‌జరిగే విధంగా చూడాలి.
12. కరోనా మొదటి దశలో వైద్య సేవలు అందించిన డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని కరోనా వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా చూడాలి.

0
0