కరోనాపై పోరాటానికి యాచకుడి సాయం

0
257

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రతినిధి షేక్.ఉస్మాన్ ✍️
కరోనపై పోరులో భాగంగా సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు,క్రికెటర్లు ఇలా చాలా మంది ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందించారు. అయితే తమిళనాడులో ఓ యాచకుడు కరోనా సహాయ నిధికి తన వంతు సాయం చేశాడు. మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు తాను భిక్షాటన చేయగా వచ్చిన రూ.10వేలు నగదును మధురై జిల్లా కలెక్టర్ ను కలిసి అందజేశాడు. దీంతో యాచకుడి గొప్ప మనసును అందరూ ప్రసంసిస్తున్నారు.