కరీంనగర్ యువకుడు అశోక్ 37వ సారి రక్త కణాలు దానం

0
92

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగీతో బాధపడుతున్న నగునూరు గ్రామానికి చెందిన వీఆర్‌ఏ అజయ్ (29)కు అత్యవసరంగా O+ రక్త కణాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎలాబోతారం గ్రామానికి చెందిన బుచ్చాల అశోక్ తన 37వ సారి రక్త కణాలు దానం చేసి, అజయ్‌కు ప్రాణదాతగా నిలిచారు.

అశోక్ గతంలో కూడా అనేక సార్లు అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేసి, అనేక మందికి ప్రాణాధారంగా నిలిచారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా గాలిపల్లి కుమార్ మాట్లాడుతూ, “వేసవి కాలంలో రక్త కొరత తీవ్రమవుతుంది. అందువల్ల, యువత రక్త దానానికి ముందుకు రావాలి. అశోక్ వంటి రక్తదాతలు సమాజానికి స్ఫూర్తి.” అని పేర్కొన్నారు.

రక్త దానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. అందరూ ముందుకు వచ్చి రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.

0
0