కంటి పొరల సమస్యలపై ఉచిత శస్త్రచికిత్సలు – ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో పెద్దలందరికీ భారీ ఉపశమనం
పున్నమి న్యూస్ – భూపాలపల్లి
కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. కంటి పొరల (క్యాటరాక్ట్) సమస్యతో బాధపడే వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, వారికి నిర్ధారిత వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా శస్త్రచికిత్సలు అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి అనుసంధానంగా జూన్ 4, 2025 (బుధవారం) రోజు ప్రత్యేక బస్సు భూపాలపల్లికి వస్తుంది. అర్హులైన వృద్ధులను కరీంనగర్ చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించి, అక్కడ నిపుణులైన డాక్టర్లచే కంటి ఆపరేషన్లు చేయబడతాయి.
ఆపరేషన్ అనంతరం, నల్లటి కంటి అద్దాలు, నెలకు సరిపడా మందులు ఉచితంగా, పేషెంటు మరియు తోడొచ్చే వ్యక్తులకు ఉచిత భోజనం సైతం అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు 9440903023 నంబర్‌ను సంప్రదించవచ్చు.
వెంట తీసుకురావాల్సినవి:
✅ ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ – 3
✅ కలర్ ఫోటోలు – 3
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మాట్లాడుతూ – “ప్రజాసేవే పరమోధర్మం అనే సూత్రంతో, ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.