Story highlights
- కంటకాపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా: తూరుబిల్లి ఆనంద్ కంటకాపల్లి: గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూరుబిల్లి ఆనంద్ గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
- తనకు ఎన్నికల అధికారులు కేటాయించిన మంచం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
- గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
కంటకాపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా: తూరుబిల్లి ఆనంద్
కంటకాపల్లి: గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూరుబిల్లి ఆనంద్ గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తనకు ఎన్నికల అధికారులు కేటాయించిన మంచం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తానన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం, వృద్ధులకు ప్రభుత్వ పథకాల అందజేత, పాఠశాలలు మరియు గ్రామ పరిసరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించడమే తన ఆశయమని ఆనంద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కంటకాపల్లి గ్రామ ప్రజలు తన ఎన్నికల గుర్తు మంచంపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తూరుబిల్లి ఆనంద్ విజ్ఞప్తి చేశారు.