संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

ఐ పోలవరం మండలంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై కళాజాత అవగాహన కార్యక్రమం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఐ పోలవరం మండలంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై కళాజాత అవగాహన కార్యక్రమం

खबर की मुख्य बातें

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.
  • పోలవరం మండలం కేశనకుర్రు మార్కెట్ ప్రాంతం మరియు గుత్తెనదీవి సెంటర్ నందు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై కళాజాత అవగాహన కార్యక్రమాన్ని ప్రేమనందం బుర్రకథ బృందంచే నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య,…
  • ఐ.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం కేశనకుర్రు మార్కెట్ ప్రాంతం మరియు గుత్తెనదీవి సెంటర్ నందు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై కళాజాత అవగాహన కార్యక్రమాన్ని ప్రేమనందం బుర్రకథ బృందంచే నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు దిశా /జనకళ్యాణ్ ప్రివెన్షన్ యూనిట్ మరియు లింక్ వర్కర్స్ స్కీమ్ అలాగే చేంజెస్ సి ఎస్ ఓ క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో ఇంటెన్షఫెడ్ ఐ ఈ సి క్యాంపెన్ కార్యక్రమంలో భాగంగా హెచ్. ఐ. వి మరియు ఎయిడ్స్ పైన అవగాహనా కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి హెచ్. ఐ.వి ఎలా వస్తుంది, ఎలా రాదు, రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, హెచ్ఐవి వచ్చిన పరిస్థితుల్లో చికిత్స ఎక్కడ లభ్యం అవుతుంది, సుఖవ్యాధుల పట్ల అవగాహన, వివక్షత, మరియు డ్రగ్స్ గురించి అలానే హెచ్. ఐ. వి చికిత్స గురించి తెలుపుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స, హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ పైన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని కళాజాత కార్యక్రమంలో వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ -1097గురించి,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం -2017 గురించి , ఏ ఆర్ టి మందుల కేంద్రాలు, సుఖవ్యాధులు, టీబీ,యు ఆర్ కోడ్ గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం సీబీస్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ జి. శ్రీను, ఔట్రీచ్ వర్కర్ ఏం . వి జ్యోతి, సి ఎస్ ఓ సిబ్బది దుర్గ , లింక్ వర్కర్ సిబ్బంది మరియు టి ప్రాజెక్ట్ పీఠం ఎడ్యుకేటర్ గుర్రాల అమల, లోకల్ పిహెచ్ సి సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఔట్రేచ్ వర్కర్స్ ఎమ్. సుధా, ఎచ్ మంగళమ్మ, కె సుధా,లక్ష్మి,భారతమ్మ,ఇందిరమ్మ పీర్ ,ఎడ్యుకేటర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *