खबर की मुख्य बातें
- మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను నివారించాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు సి.
- శారద పేర్కొన్నారు.
- మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లను అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు.
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను నివారించాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు సి. శారద పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లను అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఓటుహక్కు వినియోగం ద్వారానే ప్రజాభిప్రాయం వెల్లడవుతుందన్నారు. గ్రామాల స్వయంపాలన, సాధికారతకు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు ఎంతో అవసరమని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరారు. ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग