నెల్లూరు, జూలై 28, 2020 (పున్నమి విలేఖరి) : రాష్ట్రంలో ఇప్పటి వరకు వున్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య ఒక ప్రకటనలో కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 అక్టోబర్‌లో సుమారు వివిధ శాఖలలో గ్రూప్-1, గ్రూప్-2లలో ఖాళీ ఉన్న ఉద్యోగాలు కలిపి సుమారు 6000 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి వాటి కాల పరిమితిని గత ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చింది. ఎంతో కాలం నుండి బ్యాక్‌లాగ్ పోస్టుల నియామకాల కోసం ఎదురు చూస్తున్న దళిత, గిరిజన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో వయస్సు సడలింపు పై కూడా ఆలోచించాలని ఆయన కోరారు.