విశ్వనాథరావుపేట ఉప సర్పంచ్‌గా వట్టికూటి అంకమ్మరావు ఏకగ్రీవ ఎన్నిక
పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు: బోగోలు మండలంలో పంచాయతీ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
బోగోలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందిన కుందుర్తి వెంకట వరప్రసాదరావు కుటుంబ సభ్యులు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా గెలుపొందేందుకు సహకరించి, అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా మండలంలోని విశ్వనాథరావుపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా వట్టికూటి అంకమ్మరావు (అశోక్)ను వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్ లేళ్లపల్లి సుధీర్ కుమార్‌కు, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग