संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఎన్ హెచ్ 16 పై డ్రైనేజీ పైపుల చోరీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎన్ హెచ్ 16 పై డ్రైనేజీ పైపుల చోరీ
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 44;

ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పైపులు మాయం.. పట్టించుకోని అధికారులు?
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 29::
ఎన్‌హెచ్‌–16 రూట్‌లో రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మించిన బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు రోడ్డుపైకి రాకుండా డ్రైనేజీలోకి మళ్లించేందుకు ఏర్పాటు చేసిన పైపులు చోరీకి గురవుతున్నాయి. బ్రిడ్జిలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన పైపులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రజల సౌకర్యం, రహదారి భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ పైపులు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పేర్కొంటున్నారు.
ఇలాంటి చోరీలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పైపుల చోరీకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఎవరైనా పైపులను తొలగించడం లేదా తరలించడం గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
“ప్రజా ఆస్తి మన ఆస్తి.. కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని స్థానికులు పేర్కొన్నారు.

ఎన్ హెచ్ 16 పై డ్రైనేజీ పైపుల చోరీ

ఎన్ హెచ్ 16 పై డ్రైనేజీ పైపుల చోరీ

ఎన్ హెచ్ 16 పై డ్రైనేజీ పైపుల చోరీ

ఎన్ హెచ్ 16 పై డ్రైనేజీ పైపుల చోరీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *