संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

ఎన్‌సీసీ మాస్ స్వచ్ఛతా కార్యక్రమం – “ఏక్ ఘంటా, ఏక్ సాత్”

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఎన్‌సీసీ మాస్ స్వచ్ఛతా కార్యక్రమం – “ఏక్ ఘంటా, ఏక్ సాత్”

खबर की मुख्य बातें

  • 10 (T) బెటాలియన్ NCC, వరంగల్ వారి ఆదేశాల మేరకు విజ్ డమ్ హై స్కూల్, నర్సంపేటలో NCC Mass Swachhta Campaign – Ek Ghanta Ek Saath కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో భాగంగా NCC క్యాడెట్లు పాఠశాల పరిసరాలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి, పరిశుభ్రత, ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు.
  • ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జావెద్ వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్ NCC క్యాడెట్ల సేవలను అభినందించి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

10 (T) బెటాలియన్ NCC, వరంగల్ వారి ఆదేశాల మేరకు
విజ్ డమ్ హై స్కూల్, నర్సంపేటలో NCC Mass Swachhta Campaign – Ek Ghanta Ek Saath కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా NCC క్యాడెట్లు పాఠశాల పరిసరాలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి, పరిశుభ్రత, ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జావెద్ వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్ NCC క్యాడెట్ల సేవలను అభినందించి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని PET & NCC ANO/Second Officer ప్రశాంత్ కుమార్ , PET శ్రీ రాజేష్ సమన్వయం చేశారు. క్యాడెట్లకు స్వచ్ఛ భారత్, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా NCC క్యాడెట్లలో శుభ్రమైన పాఠశాల – శుభ్రమైన పరిసరాలు – పరిశుభ్రమైన భారతదేశం అనే భావనను మరింత బలపరచడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *