संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రింబవళ్లు పెట్రోలింగ్‌.. అనుమానితులపై ప్రత్యేక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రింబవళ్లు పెట్రోలింగ్‌.. అనుమానితులపై ప్రత్యేక

విశాఖపట్నం, అక్టోబర్ 23 (పున్నమి ప్రతినిధి):

ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు విశాఖపట్నం సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సౌత్ సబ్ డివిజన్ పరిధిలో స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి విస్తృతంగా వాహన తనిఖీలు, రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు.

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేపడుతున్నారు.

తనిఖీల్లో భాగంగా వాహనదారులను ఆపి వారి వివరాలు, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సౌత్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.డి. బాబు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాత్రి పెట్రోలింగ్, వాహన తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ తనిఖీల్లో స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సాంబశివరావుతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రింబవళ్లు పెట్రోలింగ్‌.. అనుమానితులపై ప్రత్యేక

ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రింబవళ్లు పెట్రోలింగ్‌.. అనుమానితులపై ప్రత్యేక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *